Sunday, 20 August 2017

ఒసేయ్ అరుంధతి - శ్రీకాకుళం యాస

పశుపతి: ఓస్ అరుంధతి నను చంపేసి సమాధిలో కుల్లబెట్టేసిన నిన్ను వదలనంతే...
అరుంధతి: ఓర్ సచ్చినోడ ఏట్రా వాగుతున్నావ్ గబి గబి గుద్దీయగలను. వెధవ కంపు కొడుతుంది తానం చేసి ఎన్నేలైన్దేటి...

పూసింది పూసింది పున్నాగ - సీతారామయ్య గారి మనవరాలు

కరిసింది కరిసింది ఓ కుక్క, నా పిక్కంతా లాగింది ఈ పక్క...

ఒసేయ్ అరుంధతి - అరుంధతి

క్షుద్ర పూజలు నేర్చుకొని చాలా రోజుల తర్వాత ప్రతీకారం తీర్చుకోడానికి వచ్చిన పశుపతి అరుంధతితొ చెప్పే డైలాగ్....
ఒసేయ్ అరుంధతి నన్ను చంపి సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల బొమ్మాలి వదల.....
మనోడు కొంచెం లేట్గా కాకుండా చాలా లేట్గా వచ్చేసరికి అరుంధతి కాస్త ముసలిది ఐపోయింది...
అప్పుడు ఆమె చెప్పే డైలాగ్.....
ఏమిట్రా వెధవ ఏమిటి ఎదో అంటున్నావ్, వినపడి సావలా, కొంచం గట్టిగా చెప్పూ....
పశుపతి: ఒసేయ్ అరుంధతి, నీకు చెవుడా!!!!!!!  తు..నాజీవితం.....

ఇప్పటికింకా నా వయసు - పోకిరి

ఈ సాంగ్ ని ఒక ముసలామె పాడితే.....

ఇప్పటికింకా నా వయసు నిండా నూరేళ్ళే రేపో మాపో పోతానేమో అని చుట్టూ జనాలే...
ఇప్పటికింకా నా వయసు నిండానూరేళ్ళే రేపో మాపో పోతానేమో అని చుట్టూ జనాలే...
నాకేమి కనపడట్లే నాకేమి వినపడట్లే వయసు పొమ్మంది పోవాలిలే...

చేతిలోన చెయ్యేసి చెప్పేయన - బొంబాయి ప్రియుడు

ఒక కోపంగా ఉన్నఅమ్మాయి పాడితే....

పీకమీద కాలేసి తోక్కేయన నిను ఇప్పుడే...మరి ఇక్కడే.......
                                 తొక్కమీద కాలేసి పడ్డాను ఇప్పుడే, ఇక నను దొబ్బకే..........
పీకమీద కాలేసి తోక్కేయన నిను ఇప్పుడే...మరి ఇక్కడే.......
                                 తొక్కమీద కాలేసి పడ్డాను ఇప్పుడే, ఇక నను దొబ్బకే..........